ETV Bharat / city

Double Bedroom House Inauguration : 'ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే' - బన్సీలాల్​పేట్​లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం

Double Bedroom House Inauguration : రెండు పడక గదుల ఇళ్ల పథకంలో భాగంగా పేదలకు రూ.40 లక్షలు విలువ చేసే ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. కుల మతాలకతీతంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పారు.

Double Bedroom House Inauguration
Double Bedroom House Inauguration
author img

By

Published : Dec 17, 2021, 11:35 AM IST

బన్సీలాల్​పేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం

Double Bedroom House Inauguration : పండుగ వాతావరణంలో ఇళ్ల ప్రారంభోత్సవం జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాకముందు మంచినీటి కోసం కూడా గోసపడ్డామన్న కేటీఆర్.. అర్హులైన పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. నగరంలోని పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు అందజేస్తామన్నారు.

విడతల వారీగా అందజేత..

Minister KTR on Double Bedroom : హైదరాబాద్‌ బన్సీలాల్‌పేట్‌లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బన్సీలాల్‌పేట్‌ చాచానెహ్రూనగర్‌లో చాచానెహ్రూనగర్‌లో రూ.19.20 కోట్లతో 264 ఇళ్లు నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇల్లు కట్టి.. పెళ్లి చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆర్..

KTR Double Bedroom Inauguration : "ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలంటారు. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం సంకల్పించారు. రూ.40 లక్షల విలువైన ఇంటిని ఉచితంగా అందిస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్‌ను 10 రెట్లు పెంచాం. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి ఇళ్లు కట్టాం. భాగ్యనగరంలోని పేదలందరికీ ఇళ్లు వచ్చేలా చూస్తాం. ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవు. లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తాం."

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.