డిగ్రీ ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలు, కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను మభ్య పెట్టి.. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
- జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
- జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
- జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
- జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్
- జులై 23 నుంచి రెండో విడత ప్రక్రియ ప్రారంభం
- జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
- జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
- ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
- ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
- ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
- ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
ఇదీ చదవండి: గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం