కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు దాతలు చేయూత అందిస్తున్నారు. సంబంధించిన చెక్కులను దాతలు మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీరెడ్డి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి... మూడు కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు ఇచ్చారు. ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి రెండు కోట్ల రూపాయల చెక్కు అందించారు.
పోచంపాడ్ కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విలువైన పీపీఈ కిట్లు అందించింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ 36 లక్షల 71 వేల రూపాయల చెక్కులను విరాళంగా ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్ ఎండీ పద్మజా చుండూరు రూ. 30 లక్షలు చెక్కు అందజేశారు.
ఈవెంట్స్ నౌ సంస్థ రూ. 28 లక్షలు విరాళంగా అందించింది. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ ఫండ్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలు, టోల్ ప్లస్ ఇండియా లిమిటెడ్ 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం తరఫున 23 లక్షల రూపాయలు, త్రిబుల్ లైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్‌కు విరాళంగా అందించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో చేయూతగా రాష్ట్ర ప్రభుత్వానికి సీడ్స్‌మెన్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3 కోట్ల 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. సంబంధించిన చెక్కును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అందించారు.
సత్తుపల్లి నియోజవర్గానికి చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, సొసైటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 17 లక్షల 85 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సంబంధించిన చెక్కును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు అందించారు.
ఇదీ చూడండి: స్వీయ నిర్బంధం.. అమ్మతో బలపడుతున్న బంధం