విశాఖ మన్యంలో 21 రోజుల కిందట వరద ఉద్ధృతిలో లక్ష్మయ్య అనే రైతు కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంత వెతికినా...లక్ష్మయ్య ఆచూకీ అస్సలు దొరకలేదు. రైతు మృతదేహం ఇసుకలో కూరుకుపోయింది. ఉన్నాడో లేడో..తెలియని పరిస్థితి. కుటుంబ సభ్యుల ఆవేదన. అలాంటి సమయంలో ఏమనుకున్నాయో...లక్ష్మయ్యకు చెందిన శునకాలు. పాడేరుకు మూడు కిలో మీటర్ల దూరంలో...నది ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన రైతు మృతదేహాన్ని గుర్తించాయి. కాళ్లతో ఇసుక తవ్వి మరీ..రైతు తండ్రి సన్యాసికి ఆచూకీ చూపించాయి. రైతు తండ్రి వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించి...మృతదేహాన్ని బయటకు తీశారు. విశ్వాసానికి మారుపేరు అని మరోసారి రుజువు చేశాయీ శునకాలు.
ఇదీ చూడండి: అనుమానమే పెనుభూతమై... ప్రేమికుడి చేతిలో యువతి హతం!