ETV Bharat / city

గీతం విద్యార్థికి గౌరవ డాక్టరేట్​ - సంగారెడ్డి జిల్లా వార్తలు

గీతం డీమ్డ్​ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక స్కాలర్ విద్యార్థి మనోహర్ మంటిపల్లికి గౌరవ డాక్టరేట్​ లభించింది. క్యాన్సర్ నివారణ కోసం దుష్ప్రభావాలు లేని నూతన ఔషధాల రూపకల్పన, వాటిపై అధ్యయనం, విశ్లేషణ వ్యాసాన్ని సమర్పించి నందుకు డాక్టరేట్ లభించిందని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రాంబాబు వెల్లడించారు.

Telangana news
డాక్టరేట్​ పొందిన గీతం విద్యార్థి
author img

By

Published : Jun 8, 2021, 1:35 PM IST

క్యాన్సర్​ వ్యాధి నిరోధకాల వృద్ధికి కృషిచేయడంతో పాటు, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్​ గీతం డీమ్డ్​ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి మనోహర్​కు డాక్టరేట్​ లభించింది. క్యాన్సర్​పై పరిశోధన నిర్వహించే అంతర్జాతీయ సంస్థ (ఐఏఆర్సీ) ప్రకారం, విశ్వవ్యాప్తంగా 2040 నాటికి 27.5 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడతారని... దాదాపు 16.3 కోట్ల మంది చనిపోతారని ఓ అంచనా. ఈ నేపథ్యంలో క్యాన్సర్ నివారణ కోసం సహజంగా వినియోగించే ఔషధాలు వ్యాధిని పూర్తిగా తగ్గించకపోగా... దుష్ప్రభావాలకు దారితీస్తున్నాయని తెలిపారు. ఈ పరిశోధనలో క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను అభివృద్ధి చేయడానికి, క్యాన్సర్‌ను గుర్తించే సంక్షిప్త అధ్యయనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు డాక్టర్ రాంబాబు తెలిపారు.

కిమోథెరపీ ఔషధాల ఆవశ్యకత ఆధారంగా అధిక శక్తిని, తక్కువ దుష్ప్రభావాలను పొందడానికి మూడు నూతన సమ్మేళనాలను అభివృద్ధి చేశామన్నారు. మనోహర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్​డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి: అరుదైన రికార్డు నమోదు చేసిన ప్రగతి రిసార్ట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.