దేవరయాంజల్ భూముల్లోని వారిని ఖాళీ చేయించొద్దని హైకోర్టు ఆదేశించింది. వివాదాస్పద భూమిపై ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దేవరయాంజల్ భూముల నుంచి తమను ఖాళీచేయిస్తున్నారని స్థానికుడు కిషన్రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. షెడ్లు కూల్చివేస్తామని, ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఆయా భూములపై విచారణ చేస్తున్నామని.. ఖాళీచేయించడం లేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం... అక్కడి నుంచి ఎవరిని ఖాళీ చేయించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవీచూడండి: ఏ చట్టం కింద సర్వేకు వెళ్లి బోర్డు పెట్టారు?: హైకోర్టు