ETV Bharat / city

RAMOJI FOUNDATION: రామోజీ ఫౌండేషన్ చేయూత.. విద్యార్థులకు బ్యాగులు, బీరువాలు పంపిణీ

RAMOJI FOUNDATION: ఉన్నత ఆశయాలతో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న రామోజీ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని ఏపీలోని ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళీ అన్నారు. ఒంగోలులో బొమ్మరిల్లు బాలుర వాకిటిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లగేజీ బ్యాగులు, లైబ్రరీ బీరువాలు పంపిణీ చేశారు.

RAMOJI FOUNDATION
ఒంగోలులో బొమ్మరిల్లు బాలుర వాకిటిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లగేజీ బ్యాగులు, లైబ్రరీ బీరువాలు పంపిణీ
author img

By

Published : Jan 4, 2022, 10:49 PM IST

RAMOJI FOUNDATION: మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్న ఈనాడు సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం, ఉన్నత ఆశయాలతో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న రామోజీ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళీ అన్నారు. ఒంగోలులోని బొమ్మరిల్లు బాలుర వాకిటిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు లగేజీ బ్యాగులు, బీరువాలు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పాల్గొన్నారు. మనుషుల్లో మానవత్వం పరిమళించినప్పుడే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని, అనాథలైన పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలు, తెలివితేటలు ఉంటాయని ఆయన తెలిపారు.

ఒంగోలులో బొమ్మరిల్లు బాలుర వాకిటిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లగేజీ బ్యాగులు, లైబ్రరీ బీరువాలు పంపిణీ

Ramoji Foundation‌ Services: అలాంటి వారిని చేరదీసి, వారికి బంగారు భవిష్యత్​ కల్పిస్తున్న బొమ్మరిల్లు సంస్థ కృషిని అభినందించాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళీ పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఈ సంస్థలో 80 శాతం మంది పిల్లలు అనాథలుగా ఉండటం కలిచివేసిందని.. వీరికి తన వంతు కృషిగా ఏదైనా కార్యక్రమం చేపట్టి సహకారం అందిస్తానని చెప్పారు. సంస్థ అధినేత రాజ్యలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో అనేక సేవా సంస్థలు ఉన్నా, తమ సంస్థను ఎంపిక చేసి సహాయం అందించిన రామోజీ ఫౌండేషన్​కు కృతఙ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:
GOVERNOR ON INFANT MORTALITY: విశాఖ మన్యంలో శిశు మరణాలపై గవర్నర్ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.