ETV Bharat / city

అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ.. బిల్లుల ఆమోదం

బడ్జెట్​పై అసెంబ్లీలో రెండో రోజు చర్చ ముగిసింది. పలు పద్దులకు సభలో ఆమోదం లభించింది. అంతకు ముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. సోమవారంతో సమావేశాలు ముగియనున్నాయి.

author img

By

Published : Mar 14, 2020, 11:46 PM IST

అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ.. బిల్లుల ఆమోదం
అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ.. బిల్లుల ఆమోదం

రెండో రోజు శాసనసభలో రెవెన్యూ, ఎక్సైజ్, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, రవాణా, హోంశాఖకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. ఆయా బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

మద్యంపై ఆదాయం పెంపు

దుకాణాలు పెంచకుండానే ఆబ్కారీ ఆదాయం రెట్టింపు చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మద్యం నియంత్రించి, బెల్టు షాపులు రద్దు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన డిమాండ్​కు మంత్రి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ సమర్థ చర్యలతోనే ఆబ్కారీ ఆదాయం పెంపు సాధ్యమైందని గుర్తుచేశారు.

మూసీకి 10వేల కోట్లు

మూసీ నదిలో మురికిని తొలగించి, సుందరమైన నదిగా తీర్చిదిద్దడానికి రూ.50 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్​లో మూసీ నది ప్రక్షాళనకు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

పెరిగిన వరి సాగు

రైతుల కన్నీరు తుడవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. కాళేశ్వరం జలాలతో ఖరీఫ్​లో 40 లక్షలు, రబీలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు మంత్రి తెలిపారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని చెరువులు, వాగుల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

నేరుగా రైతు ఖాతాలోనే

ఈ ఏడాది ఖరీఫ్‌ కంటే రబీలో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు సొమ్ము నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాలో వేస్తున్నామని పేర్కొన్నారు.

కులవృత్తుల బలోపేతం

కులవృత్తులను బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందని పశసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ పేర్కొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్​లో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. విజయ డైరీ ప్రక్షాళనలో రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు.

పద్దులపై చర్చ, ఆమోదం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి రేపటికి వాయిదా వేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

ఇవీచూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్​: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.