Traffic Pending Challans: ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ల ఆఫర్ త్వరలోనే ముగిసిపోనుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో ఈనెల 31లోపు కట్టేందుకు వీలు కల్పించారు. దీనికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉంది. డిస్కౌంట్‌తో పెండింగ్ చలాన్లను కట్టేందుకు ఈనెల 1 నుంచి అవకాశం కల్పించారు. ఇప్పటికే చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
తొలుత సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తినప్పటికీ క్రమంగా దాన్ని పరిష్కరించడంతో వాహనదారులు డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. డిస్కౌంట్‌తో కట్టేందుకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గడువు తీరిన తర్వాత భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా.. ఎందుకంటే..?