ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు... బ్లాక్ ఫంగస్ సోకిన 16 నెలల బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన జానకీనందన్ అనే బాలుడికి బ్లాక్ ఫంగస్ నిర్ధరణ కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
ఆ బాలుడికి ఈనెల 3న ఆపరేషన్ చేసిన వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఇది దేశంలోనే అరుదైన చికిత్స అని వైద్యులు తెలిపారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడిన అందరికీ రుణపడి ఉంటామని ఆ బాలుడి తల్లిదండ్రులు ఉద్వేగానికి గురయ్యారు.