ETV Bharat / city

Fever survey: ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే: డీహెచ్​ - beds allotted for black fungus in telangana

బ్లాక్​ ఫంగస్(black fungus)​ చికిత్స కోసం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 1500 పడకలు కేటాయించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్​) శ్రీనివాసరావు తెలిపారు. కరోనాకు చికిత్స అందిస్తోన్న ప్రైవేటు ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

dh srinivas rao
ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే: డీహెచ్​
author img

By

Published : May 27, 2021, 8:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో 17 వేలకుపైగా బృందాలు పాల్గొన్నాయని డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాసరావు (director of health telangana)తెలిపారు. ఆరోగ్య బృందాలు ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే(fever survey) చేసినట్లు వెల్లడించారు. కొవిడ్‌ ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఇప్పటివరకు 64 ప్రైవేటు ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయని డీహెచ్​ వెల్లడించారు. వీటిని పరిశీలించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు. ఆయా ఆస్పత్రులు 24 నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని శ్రీనివాసరావు తెలిపారు.

రాష్ట్రంలో 1,200కు పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్‌ (మ్యూకోర్ ​మైకోసిస్​)కు 44 ఆస్పత్రులు చికిత్స అందిస్తున్నాయన్నారు. ​

బ్లాక్ ఫంగస్‌(black fungus) చికిత్సకు 1,500 పడకలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో 270 మంది చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే: డీహెచ్​

ఇవీచూడండి: corona: రాష్ట్రంలో కొత్తగా 3,614 మందికి కొవిడ్ పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.