ETV Bharat / city

'అడ్డగుట్ట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని పరిష్కరించాం'

హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు ఉప సభాపతి పద్మారావు గౌడ్ ప్రభుత్వ సహకారం అందించారు. అడ్డగుట్టలోని పలు ప్రాంతాల్లో కాలినడకన పర్యటించిన పద్మారావు గౌడ్​... బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహకారాన్ని అందించారు.

author img

By

Published : Oct 27, 2020, 7:54 PM IST

'అడ్డగుట్ట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని పరిష్కరించాం'
'అడ్డగుట్ట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని పరిష్కరించాం'

హైదరాబాద్​లోని అడ్డగుట్ట ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న రూ.10 వేల ఆర్థిక సహకారాన్ని అడ్డగుట్టలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేశారు. వెంకట్​నగర్, శాస్త్రినగర్ ప్రాంతాల్లో పద్మారావుగౌడ్​ పాదయాత్ర నిర్వహించారు.

కార్పొరేటర్ విజయ కుమారి, తెరాస యువ నేతలు కిశోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్​తో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాధితులందరికి ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించినట్లు పద్మారావుగౌడ్​ తెలిపారు. వెంకట్​నగర్​లో మంచి నీటి ఎద్దడిని నివారించేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాస్త్రినగర్​లోని సమస్యలపై త్వరలోనే సమీక్షిస్తామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'హలో! మంత్రి ఈటల కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ..'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.