ETV Bharat / city

'వరద బాధితుల ఆర్థిక సాయంలో దళారుల జోక్యం తగదు'

సికింద్రాబాద్​లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేతపై ఉపసభాపతి పద్మారావుగౌడ్​ సమీక్ష నిర్వహించారు. రూ.పది వేలు ఆర్థిక సాయంలో దళారీలు జోక్యం చేసుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

deputy speaker padmarao goud review meeting in hyderabad
'వరద బాధితుల ఆర్థిక సహాయంలో దళారుల జోక్యం తగదు'
author img

By

Published : Nov 5, 2020, 10:35 PM IST

ప్రభుత్వం వరద బాధితులకు అందించే రూ.పది వేల ఆర్థిక సాాయంలో దళారీలు జోక్యం చేసుకుంటే వెంటనే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉపసభాపతి పద్మారావుగౌడ్​ హెచ్చరించారు. సికింద్రాబాద్​ పరిధిలో రెండో విడత ఆర్థిక సాయం పంపిణీపై అధికారులు, నేతలతో సమీక్షించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సాాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని తెలిపారు.

సికింద్రాబాద్​ నియోజకవర్గ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్​మండీ, బౌద్ధనగర్​ డివిజన్​లో రెండో విడతలో అర్హత కలిగిన కుటుంబాలకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని పద్మారావుగౌడ్​ తెలిపారు. దళారీల ప్రమేయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా దళారీలు, తాము డబ్బులు ఇప్పిస్తామని నమ్మిస్తే వెంటనే నామాలగుండులోని తమ క్యాంపు కార్యాలయాన్ని 040-27504448 నంబర్ ద్వారా సంప్రదించాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇదీ చదవండిః ధరణిపై హైకోర్టు కీలక ఆదేశాలు... నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.