కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీయాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ప్రజలను కోరింది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న దళిత , ఆదివాసీ నేతలను, కవులను, కళాకారులను అక్రమ అరెస్ట్‌లతో నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలపై పాశవిక నిర్భంధం ప్రయోగిస్తూ...మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించబడవని...పోరాటం ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కరించబడుతాయని వారు తెలిపారు.
ఇవీ చూడండి:'తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు'