Demand for Booster Dose: రాష్ట్రంలో ఈమధ్య కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్‌డోసుకు డిమాండ్ పెరిగింది. నిత్యం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా బూస్టర్ డోసులు పంపిణీ చేస్తునట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో 7 లక్షల 47 వేల 822 మందికి బూస్టర్ డోస్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే.. రోజుకు సుమారు లక్షా ఆరువేలమందికి పైగా కొవిడ్ బూస్టర్ డోసు తీసుకుంటుండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఒక్క బుధవారం రోజే అత్యధికంగా లక్షా 34 వేల 525 మంది బూస్టర్ డోస్ తీసుకునట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి నుంచి రాష్ట్రంలో కొవిషీల్డ్ టీకాలను అత్యధికంగా పంపిణీ చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు బూస్టర్ డోస్‌కు ఆటంకం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరీజీ కేంద్రంలో ఒక్క కొవిషీల్డ్ డోస్ కూడా అందుబాటులో లేకపోవటం సోచనీయం. జిల్లా స్థాయి కేంద్రాల్లో మాత్రం రాష్ట్రం మొత్తం మీద కలిపి 2 లక్షలా 10 వేల 560 కొవిషీల్డ్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
కేంద్రం నుంచి కొత్త డోసులు అందుబాటులోకి రాకపోతే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకాల కొరతపై ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరికొన్ని కొవిషీల్డ్ డోసులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొవాగ్జిన్ 14 లక్షవ 55 వేల 150, కోర్బివ్యాక్స్ 3 లక్షల 88 వేల 360 డోసులు అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చూడండి: