ETV Bharat / city

రాష్ట్రంలో అంబులెన్స్​కు 10రెట్లు పెరిగిన డిమాండ్

కొవిడ్‌ రోగిని ఆసుపత్రికి తరలించాలన్నా.. ఆసుపత్రిలో కోలుకున్న వారిని ఇంటికి చేర్చాలన్నా.. చికిత్స పొందుతూ మృతిచెందితే చితికి తరలించాలన్నా.. ఏకైక మార్గం... అంబులెన్స్‌. ఈ ఏడాది ఆరంభంతో పోల్చితే ప్రస్తుతం అంబులెన్స్‌ డిమాండ్‌ దాదాపు పది రెట్లకు పెరగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

demand for ambulance, ambulance please, telangana corona cases
అంబులెన్స్​కు డిమాండ్, అంబులెన్స్ ప్లీజ్, తెలంగాణలో కరోనా కేసులు
author img

By

Published : Apr 24, 2021, 6:57 AM IST

Updated : Apr 24, 2021, 7:20 AM IST

  • కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి హన్మకొండ రెడ్డికాలనీలో ఉంటున్నారు. కొవిడ్‌బారిన పడి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందంటూ గురువారం ఉదయం 108 కేంద్రానికి ఫోన్‌ రావడంతో 9.25 గంటలకు ఆంబులెన్స్‌ సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. అతడికి ఆంబులెన్స్‌లోనే ఆక్సిజన్‌ అందించి మూడు గంటల్లో హైదరాబాద్‌ శామీర్‌పేట ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. ... కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 108 ఆంబులెన్స్‌ సర్వీస్‌ల సిబ్బంది పనితీరుకు ఇదో మచ్చుతునక.

  • సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించడంతో అంత్యక్రియల నిమిత్తం అతడి మృతదేహాన్ని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ శ్మశానవాటికకు తరలించాల్సి వచ్చింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ ఆంబులెన్స్‌ నిర్వాహకుడిని పిలిపించి ఆ బాధ్యతను అప్పగించారు. సదరు ఆంబులెన్స్‌ నిర్వాహకుడు నలుగురు బాయ్స్‌ సహకారంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాడు. ... గాంధీ ఆసుపత్రి వద్ద ప్రైవేటు ఆంబులెన్స్‌ నిర్వాహకుల సేవలకు ఇదో ఉదాహరణ.

తెలంగాణలోని 108 వాహనాలు జనవరి నెలలో రోజుకు సగటున 26 మంది కొవిడ్‌ రోగుల్ని తరలిస్తే.. ఏప్రిల్‌లో ఈ సగటు ఏకంగా 238. కరోనా ఉద్ధృతికి అద్దం పట్టే లెక్క ఇది. కొవిడ్‌ సోకిన రోగులను తరలించేందుకు ఏ వాహనాలూ ముందుకు రాని పరిస్థితుల్లో అంబులెన్స్‌లపై ఒత్తిడి పెరుగుతోంది.

కరోనా సెకండ్‌వేవ్‌లో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అందుబాటులో ఉన్న 108, ప్రైవేటు అంబులెన్స్‌లు సరిపోవడం లేదు. ఈ ఏడాది ఆరంభంతో పోల్చితే ప్రస్తుతం డిమాండ్‌ దాదాపు పది రెట్లకు పెరగడమే పరిస్థితి తీవ్రతను చాటుతోంది. తొలి మూడు నెలల్లో సాధారణంగానే ఉన్నా ఈనెలలో కరోనా అనూహ్యంగా విజృంభించడంతో అంబులెన్స్‌లకు తాకిడి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 500 వరకు 108 వాహనాల్లో సింహభాగం కొవిడ్‌ రోగుల తరలింపులోనే నిమగ్నమయ్యాయి. సాధారణంగా 108 ఆంబులెన్స్‌లు తమ పరిధిలో మాత్రమే సేవలందిస్తాయి. కానీ కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించాలనే ఆదేశాలతో చాలా ఆంబులెన్స్‌లు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోగుల్ని తీసుకెళ్తున్నాయి.

‘రోజూ 4-5 మంది కరోనా మంది రోగుల్ని ఆంబులెన్స్‌లో తరలిస్తున్నాం. ప్రతిసారీ దాదాపు మూడు గంటలపాటు పీపీఈ కిట్లు ధరించి ఆంబులెన్స్‌లోనే ప్రయాణించాల్సిరావడం ఇబ్బందికరంగా మారింది. కొన్నిసార్లు డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నాం. కరోనా రోగిని దింపిన వెంటనే వాహనాల్ని హైపోక్లోరైడ్‌, ఫార్మాలిన్‌ ద్రావణాలతో శ్రుభం చేస్తున్నాం..’ అని హన్మకొండకు చెందిన 108 అంబులెన్స్‌ అత్యవసర వైద్య నిపుణుడు (ఈఎంటీ) రాంచందర్‌ పేర్కొన్నారు.

మృతదేహాలకూ..

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు గాంధీ ఆసుపత్రి ప్రధాన కేంద్రం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రోగుల్ని ఇక్కడ చేరుస్తున్నారు. మరెంతోమంది ఇక్కడ చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఈ మృతదేహాల తరలింపు విషయంలో జీహెచ్‌ఎంసీ.. ప్రైవేటు ఆంబులెన్స్‌ నిర్వాహకుల సహకారం తీసుకుంటోంది. ఒక్కో మృతదేహం తరలింపునకు దాదాపు రూ.5వేలు చెల్లిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా దాదాపు 500 ప్రైవేటు ఆంబులెన్స్‌లు రోగులకు సేవలందిస్తున్నా.. గాంధీ ఆసుపత్రి కేంద్రంగా పనిచేసే 30-40 ఆంబులెన్స్‌లు మాత్రం మృతదేహాల తరలింపులోనే నిమగ్నమయ్యాయి. ఆసుపత్రి నుంచి మృతదేహాల్ని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ, అంబర్‌పేట, పంజాగుట్ట తదితర శ్మశానవాటికలకు తరలిస్తున్నాయి. ‘ఒక్కో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియల క్రతువును పూర్తి చేయించేందుకు 3-4 గంటల సమయం తీసుకుంటోంది. రోగుల్ని, మృతదేహాల్ని తరలించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆంబులెన్స్‌లు సరిపోవడం లేదు. వారం రోజుల నుండి ఒత్తిడి విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు..’ అని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆంబులెన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేశ్‌ వెల్లడించారు.

కొవిడ్ రోగుల తరలింపు

Last Updated : Apr 24, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.