ETV Bharat / city

హామీలన్నీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే: దాసోజు శ్రవణ్​ - ghmc election updates

జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగానే గ్రేటర్​ ప్రజలకు వరాలు, హామీలిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ విమర్శించారు. ప్రజలపై ఏమాత్రం ప్రేమున్నా.. తక్షణమే ఇంటిపన్ను, కరెంట్​ బిల్లులు పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్​ చేశారు.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/15-November-2020/DOSOJU SRAVAN.jpg
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/15-November-2020/9553210_dosoju.jpg
author img

By

Published : Nov 15, 2020, 9:40 PM IST

హైదరాబాద్‌ ప్రజలను.. మంత్రి కేటీఆర్​ మరోసారి మోసం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ విమర్శించారు. ఇంటిపన్ను తగ్గింపు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపు వంటి హామీలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీలన్నీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమేనని.. ప్రజలమీద ప్రేమతోకాదని దాసోజు విమర్శించారు. ప్రజల మీద ఏమాత్రం ప్రేమున్నా.. తక్షణమే ఎల్ఆర్ఎస్​ను ఉచితంగా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజలు మరిచిపోరని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దుబ్బాక ఉపఎన్నికల ఫలితంతో తెరాసకు భయం పట్టుకుందన్నారు. కరోనా విజృంభణలోనూ వైద్యులు, నర్సులు, పోలీసులు ఎంతో శ్రమించారని.. వాళ్లకు వేతనాలు, ప్రోత్సాహకాలు పెంచలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇంటిపన్ను, కరెంట్ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇవీచూడండి: రాజధానిలో చెరువుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.