తెలంగాణ రాష్ట్ర సమితిపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపణాస్త్రాలు సంధించారు. 16 మంది తెరాస ఎంపీ అభ్యర్థుల్లో చక్రం తిప్పేవారెవరు లేరని....అంతా భూకబ్జాదారులేనని ధ్వజమెత్తారు. ఖమ్మం అభ్యర్థిపై అత్యాచారం కేసు ఉందన్న శ్రవణ్..అతనో ఆర్థిక నేరగాడని విమర్శించారు. చేవేళ్ల టికెట్ రూ.100 కోట్ల వ్యాపారాలున్న వ్యక్తికి ఇచ్చారని దుయ్యబట్టారు. నల్గొండ టికెట్‌నునర్సింహారెడ్డిరూ.100 కోట్లకు కొన్నాడని ఆరోపించారు. యతిమ్ ఖానా భూములు వేంరెడ్డి నర్సింహారెడ్డి కబ్జా చేశాడని...ఎన్నికల అఫిడవిట్‌లో అన్ని తప్పులు ఫైల్ చేశారని పేర్కొన్నారు. వందల కోట్ల విలువైన భూములు కబ్జా చేసిన నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలపై సీఎస్‌కు లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఇలాంటి వారిని పార్లమెంట్‌కు పంపితే అక్కడ పైరవీలు చేస్తారని విమర్శించారు.
ఇవీ చూడండి:'అధికారంలోకి రాగానే పసుపు పంటకు మద్దతుధర'