ETV Bharat / city

రూ.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు - రూ.20 లక్షలు సైబర్ మోసం

cyber-criminals-earning-rs-20-lakh-in-the-name-of-gifts
రూ.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
author img

By

Published : Jul 2, 2020, 9:09 PM IST

Updated : Jul 2, 2020, 10:44 PM IST

21:05 July 02

రూ.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

రోజురోజుకి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రకాలుగా ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నారు. గిఫ్టు, ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేర్లతో 20 లక్షల రూపాయలు ఆన్​లైన్ ద్వారా సైబర్ మోసగాళ్లు కాజేశారు. యూకేలో మత బోధకుడిని అంటూ హైదరాబాద్​కి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకుని వాట్సప్ చాటింగ్ చేశారు. 

ఎయిర్ పోర్ట్ నుంచి

ఇండియాలో కరోనా ఎక్కువగా ఉందని పేదలకు హెల్ప్ చేయడానికి గిఫ్ట్​, కరెన్సీ పంపిస్తున్నామని తెలిపారు. దిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి కస్టమ్, ఐటీ, జీఎస్​టీ కట్టాలని చెప్పారు. సదరు మహిళ నుంచి రూ.11 లక్షలు కాజేశారు. తర్వాత మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరో కేసులో....

పలువురి నుంచి ఓటీపీ, ఓఎల్​ఎక్స్​ల పేరుతో 9 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : సంక్రాంతి బరిలో పవన్ 'వకీల్​సాబ్'!

Last Updated : Jul 2, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.