సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదలడం లేదు. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఓ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఆ ఫేస్బుక్ ఐడీ డీపీగా ఒక అమ్మాయి ఫొటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అలెర్ట్ అయ్యారు. తన అనుచరులందిరినీ అప్రమత్తం చేశారు.
నా పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేశారు. ఈ ఫేస్బుక్ ఐడీ డీపీగా ఓ అమ్మాయి ఫొటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫొటోలు పెట్టి నా పేరును డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నా పేరుతో కొత్తగా క్రియేట్ చేసిన ఫేస్బుక్ ఐడీ నాది కాదు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
-జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదీ చదవండి: