ETV Bharat / city

రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం

దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుందని, నాగలి సాగితేనే ఆకలి తీరుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు. 2020-21 ఏడాదికి 2.10 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు.

రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
author img

By

Published : Mar 18, 2021, 2:02 PM IST

Updated : Mar 18, 2021, 2:11 PM IST

ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం చేయడం చేతకాదన్న వాళ్లే.. నేడు వ్యవసాయ రంగంలో దేశంలోనే నెంబర్​ వన్​గా దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని చూసి ఈర్ష్య పడే విధంగా ప్రగతి సాధించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు.

  • 2014-15లో సాగు విస్తీర్ణం- కోటి 41 లక్షల ఎకరాలు
  • 2020-21లో సాగు విస్తీర్ణం - 2 కోట్ల 10 లక్షల ఎకరాలు

49 శాతానికి పైగా వృద్ధి నమోదు

  • 2014-15 లో పంటల ఉత్పత్తి - 2 కోట్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు
  • 2020-21లో పంటల ఉత్పత్తి - 4 కోట్ల 11 లక్షల మెట్రిక్ టన్నులు

గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపవుతోంది.

పత్తిని అధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రం

60 లక్షల 54 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ.. దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది. 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నులను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ) తెలంగాణ నుంచే సేకరించింది. వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా ఎఫ్​సీఐ ప్రకటించడం మనకు గర్వకారణం. 2020 సంవత్సరం యాసంగిలో ఎఫ్​సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో మన వాటా 56 శాతం కావడం గమనార్హం. ఈ యాసంగి సాగులో తెలంగాణ 52 లక్షల ఎకకాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25 లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 20 లక్షల 90 వేల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

భారత్ ఏడాదికి 70 వేల కోట్ల రూపాయల విలువ గల పామాయిల్​ను దిగుమతి చేసుకుంటోందని మంత్రి హరీశ్ అన్నారు. దీనికి బదులు దేశీయంగా ఉత్పత్తి చేస్తే బోలెడు విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు. తెలంగాణ రైతుకు ఆయిల్​పామ్ సాగు చేసేందుకు కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల తెలంగాణ రైతులు మంచి లాభాలు పొందుతారని స్పష్టం చేసింది.

ఆయిల్​పామ్ పంట వేసిన తర్వాత నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల దాకా పంట దిగుబడి వస్తూనే ఉంటుందన్నారు. దీని ద్వారా రైతుకు నిరంతర ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ పామ్​ను ప్రోత్సహించేందుకు ఎకరానికి 30 వేల రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించిందన్న హరీశ్... ఇది పోగా మిగిలిన పెట్టుబడి భారం కూడా రైతుపై పడకుండా బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. రైతులు బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేళ్ల పాటు మారిటోరియం విధించే విధంగా బ్యాంకులను ఒప్పించిందని వివరించారు. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగుకు కావాల్సిన ప్రణాళికను సర్కార్ సిద్ధం చేసిందని మంత్రి హరీశ్ తెలిపారు.

Last Updated : Mar 18, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.