లాక్డౌన్కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు జారీచేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్డౌన్ అమలు, కంటైన్మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యలను సీఎస్ వివరించారు. ఈనెల 20 అనంతరం ఇచ్చిన మినహాయింపులను కూడా కేంద్ర కేబినెట్ కార్యదర్శి వివరించారు.
ఇవీచూడండి: 'దేశంలో మొత్తం 170 హాట్స్పాట్ ప్రాంతాలు గుర్తింపు'