వైద్య, ఆరోగ్యశాఖలో ఐటీ అప్లికేషన్ల వినియోగంతో సులువుగా, నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎస్... శాఖలో ఐటీ వినియోగంపై సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేలా ఐటీ వినియోగానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
సులంభంగా వినియోగించుకునేందుకు అప్లికేషన్లు తయారు చేసేలా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి స్పష్టం చేశారు. టెక్నాలజీని సులభంగా... పారదర్శకంగా వాడుతూ... వేగవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని విభాగాధిపతులు నిర్వహించే రెగ్యులేటరీ విధులను నిర్ణీత గడువులోగా సమీక్షించి సమగ్ర నివేదికలు రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.