ETV Bharat / city

అధికారులు గ్రామాల్లో బస చేయాలని సీఎస్​ ఆదేశాలు... - cs somesh kumar review

కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లాల అటవీ, పంచాయతీ అధికారులు, డీఆర్​డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సీఎస్ సోమేశ్​కుమార్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామసభల నిర్వాహణ, ప్రగతి నివేదికల తయారీ సీజనల్ వ్యాధుల క్యాలెండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలని సీఎస్ సూచించారు.

cs somesh kumar on Sanitation in villages

author img

By

Published : Jun 17, 2021, 4:49 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు గ్రామాల్లో రాత్రిబస చేసి పారిశుద్ధ్యం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లాల అటవీ, పంచాయతీ అధికారులు, డీఆర్​డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. స్ధానిక సంస్థల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై సమీక్షించారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నుంచి సమీక్షలో పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామసభల నిర్వాహణ, ప్రగతి నివేదికల తయారీ సీజనల్ వ్యాధుల క్యాలెండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. రిజర్వు ఫారెస్ట్​బ్లాక్​లలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, జిల్లాలలో అన్ని రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పట్టణాలలో ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్సులలో పచ్చదనం, తదితర అంశాలపైనా సమీక్షించారు.

మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం, మిగిలిన గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి కోరారు. ధరణిలో పెండింగ్ ధరఖాస్తుల పరిష్కారం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్ధలాలు అప్పగించడం తదితర అంశాలపైనా అధికారులతో చర్చించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ఇదీ చూడండి: కృష్ణా జలాల విభజన త్వరగా చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.