రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు... బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై ఆయుష్ వైద్యులతో బీఆర్కే భవన్లో సీఎస్ సమావేశమయ్యారు. ఈ వ్యాధికి గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, కింగ్ కోఠిలలో చికిత్స అందిస్తున్నట్లు సీఎస్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య పద్ధతులలో లభించే చికిత్స విధానాలను గురించి ఆయుష్ వైద్యులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స అందించబడతుందని వివరించారు. ఆయుష్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు, పత్రికల ద్వారా పేషంట్లకు అవగాహన కల్పించాలని ప్రధాన కార్యదర్శి ఆయుష్ వైద్యులకు సూచించారు.