CRDA Land: ఏపీలోని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయనున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అవసరమైన 100 ఎకరాలను.. సీఆర్‌డీఏ పరిధిలో కేటాయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. విజయవాడకు తూర్పువైపున కొత్తగా బైపాస్ నిర్మించాలని, దాని నిర్మాణ వ్యయంతోపాటు భూసేకరణ భారాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తాజాగా కొత్త ప్రతిపాదన తెచ్చింది.
తాము విజయవాడ పరిధిలో నిర్మించాలని భావిస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు ఉచితంగా భూమిస్తే తూర్పు బైపాస్ భారమంతా తామే చూసుకుంటామని తాజాగా పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం విజయవాడ చుట్టుపక్కల 100 ఎకరాల భూమి కోసం అన్వేషించింది. ఎక్కడా ఒకేచోట అన్ని ఎకరాలు లేకపోవడంతో సీఆర్‌డీఏ పరిధిలోని కాలుష్య రహిత పరిశ్రమల కోసం ఎంపిక చేసిన భూముల్లో 100 ఎకరాలను ఎంఎంఎల్‌పీకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: Ugadi 2022 Special: ఉగాది రోజున ఏం చేయాలి? పచ్చడి ఎందుకు తినాలి?