ETV Bharat / city

వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం చేయాలి: తమ్మినేని వీరభద్రం - Telangana news updates

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించి.. వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. టీకా ఎప్పుడు.. ఎక్కడ దొరుకుతుందోనని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

Tammineni Veerabhadram
Tammineni Veerabhadram
author img

By

Published : May 18, 2021, 8:05 PM IST

వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించి.. వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో కరోనా రెండో డోసు వ్యాక్సిన్​ను గత నాలుగు రోజులుగా నిలుపుదల చేశారని.. టీకా కొనసాగింపుపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీకా ఎప్పుడు.. ఎక్కడ దొరుకుతుందోనని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

నివారణకు వ్యాక్సినే పరిష్కారం

రెండో డోసును ఈనెల 15 నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని… కొన్ని నిల్వలు ఉన్నా... వ్యాక్సిన్​ను నిలుపుదల చేయడం శోచనీయమన్నారు. తక్షణమే గ్లోబల్​ టెండర్ల ద్వారా వ్యాక్సిన్​ను సమీకరించి.. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్​ చేశారు. కరోనా నివారణకు వ్యాక్సినే పరిష్కారమని.. డబ్ల్యూహెచ్​ఓ ఇండియా ప్రతినిధి సౌమ్య స్వామినాథన్ కూడా ప్రకటించారని.. వెల్లడించారు.

అందుకే ఈ విపత్కర పరిస్థితి

మన దేశంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ ప్రణాళికాబద్ధంగా వేస్తే.. 40 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కరోనాను భారత్‌లో కట్టడి చేస్తామని మోదీ గొప్పలు చెప్పుకుంటూ... కుంభమేళా, ఎన్నికల ప్రచారానికే పరిమితమై కరోనాను, వాక్సినేషన్‌ను రాష్ట్రాలకు వదిలి పెట్టారని ఆరోపించారు. ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో మనం ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్​లను సమీకరించి... ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చి తన బాధ్యత నెరవేర్చలని అన్నారు. దీనికోసం టీకాల సరఫరాను పెంచుకోవడంతో పాటు, వేసే కేంద్రాలను పెంచాలన్నారు.

వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి..

తెలంగాణలో వ్యాక్సిన్‌ రెండో డోసును 15 వరకే పూర్తిచేసి, ఆ తర్వాత కొత్త వారికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గత నాలుగు రోజులుగా వ్యాక్సినేషన్‌ ఆపేశారని మండిపడ్డారు. 1.80 లక్షల డోసులు నిల్వవున్నా... వేయకపోవడం విచారకరమన్నారు. వ్యాక్సిన్‌ హైదరాబాద్​లో ఉత్పత్తి అవుతున్నందున కొనుగోలులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వమని ఆయా సంస్ధలను అడగాలని… నిన్న ముఖ్యమంత్రి గ్లోబల్‌ టెండర్‌ ద్వారా వ్యాక్సిన్‌ను సేకరించాలని ఆలస్యంగా నిర్ణయించడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన వ్యాక్సిన్‌ సమీకరణకు ప్రయత్నం చేసి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.