హైదరాబాద్ రాజ్‌భవన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను సీపీఐ నాయకులు కలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన దత్తాత్రేయను కలిసి వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకట్ రెడ్డి ఉన్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు దత్తాత్రేయ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదు'