ETV Bharat / city

అగమ్య గోచరం: కొవిడ్ కలవరం.. కొవిన్ గందరగోళం! - covin app news

కొవిన్‌ యాప్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతికంగా ఉపయుక్తంగా మారుతుందని భావించినా.. దాని నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటంతో వైద్యశాఖ కలవర పడుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు దాదాపు 73 లక్షల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉన్నందున అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ యాప్‌ ఎలా పనిచేస్తుంది..? దానిలో వస్తున్న ఇబ్బందులేంటి..? ఆ వివరాలు మీకోసం.

covin app troubles continuing in covid vaccination process
ముప్పుతిప్పలు పెడుతున్న కొవిన్‌ యాప్‌
author img

By

Published : Jan 24, 2021, 8:09 AM IST

కొవిడ్‌ టీకాల పంపిణీలో కొవిన్‌ యాప్‌ సాంకేతికంగా ఉపయుక్తంగా మారుతుందని వైద్యశాఖ భావించగా.. అందులోనూ ఇబ్బందులు తప్పడంలేదు. సాంకేతిక సమస్యల కారణంగా నిర్దేశించిన లబ్ధిదారులలో సగం మంది వివరాలే యాప్‌లో పొందుపరచగలుగుతున్నారు. మిగిలిన వారి సమాచారాన్ని పుస్తకాల్లో రాస్తున్నారు. తిరిగి యాప్‌ సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడే అందులో చేరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గంటల తరబడి వరుసలో నిలబడలేక వైద్యనిపుణులు టీకాలు పొందకుండానే వెనుదిరుగుతున్నారు.

కలవరం..

నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ తదితర అన్ని టీకా పంపిణీ కేంద్రాల్లోనూ వారం రోజులుగా సాంకేతిక సమస్యలు ఆరోగ్యశాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు దాదాపు 73 లక్షల మందికి 50 ఏళ్లు పైబడినవారు, ఆలోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇవ్వాల్సివచ్చినప్పుడు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. యాప్‌లో సాంకేతిక ఇబ్బందులను కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు గందరగోళంలో పడిపోయారు.

సమస్యలు

  • కొవిన్‌ యాప్‌ అతి నెమ్మదిగా అందుబాటులోకి వస్తోంది. ఒక్కోసారి తెరచుకోవడంలేదు.
  • ఒక్కో లబ్ధిదారుడి సమాచారాన్ని పొందుపర్చడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది.
  • టీకా పంపిణీ కేంద్రాన్ని కొత్తగా సృష్టించాలంటే తలకు మించిన భారమే అవుతోంది.
  • కొత్త కేంద్రాన్ని సృష్టించి, అందులో లబ్ధిదారుల సమాచారాన్ని పొందుపరచినప్పటికీ ఆ వివరాలు మరో టీకా పంపిణీ కేంద్రంలోకి చేరుతున్నాయి.
  • కొన్నిసార్లు సమీపంలో, మరికొన్నిసార్లు జిల్లాలు దాటి లబ్ధిదారుల సమాచారం మారిపోతోంది.
  • లబ్ధిదారుల సమాచారాన్ని నమోదుచేయగానే ఆ వ్యక్తి మొబైల్‌కు సంక్షిప్త సందేశం రావాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు.
  • కొన్నిసార్లు ఆలస్యంగా వస్తుండడంతో కేవలం ఎస్‌ఎంఎస్‌ కోసమే చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది.
  • కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి కానీ.. ఆ కేంద్రంలో వారి పేర్లు ఉండడం లేదు.

ఇదీ చూడండి: నేడు భారత్-చైనా 9వ విడత సైనిక కమాండర్ల భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.