రాష్ట్రంలోని పోలీసు, పురపాలక, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బందికి ఈ నెల 6 నుంచి 15 వరకు కొవిడ్ టీకాలను అందించనున్నారు. ఈ శాఖలకు చెందిన 2 లక్షలకు పైగా లబ్ధిదారులు టీకాను పొందనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 1,68,589 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కొవిడ్ టీకాలు పొందారు. ఈ నెల 3, 4, 5వ తేదీల్లో వీరికి మళ్లీ టీకాలు ఇవ్వనున్నారు.
- ఇదీ చూడండి : 'కొవిడ్ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్..'