ETV Bharat / city

ఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్! - covid patients afraid to live in conjusted houses in home isolation

కరోనా సోకినా లక్షణాలు తక్కువగా ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్​లోని కొన్ని బస్తీల్లో ఐదారు కుటుంబాలకు కలిపి ఒకే స్నానపుగది/మరుగుదొడ్డి ఉంటోంది. అందరూ అదే వాడడం వల్ల వైరస్‌ ఇతరులకూ సంక్రమిస్తోంది. పాతబస్తీ సహా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లోని బస్తీ వాసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

home isolation in small homes in hyderabad
ఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్!
author img

By

Published : Aug 8, 2020, 8:04 AM IST

కరోనా బారిన పడిన వ్యక్తికి ఇంట్లో చికిత్స పొందేందుకు వీల్లేకపోతే.. అద్దె భవనాల్లో ఉంచి చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. జోన్‌ స్థాయిలో అద్దె భవనాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని సూచించింది. నగరంలో ఆరు జోన్లుండగా ఒక్క ఖైరతాబాద్‌ జోన్‌ అధికారులు మాత్రమే కొన్ని భవనాలను ఐసోలేషన్‌ కేంద్రాలకు సిద్ధం చేస్తుండటం గమనార్హం. బస్తీ వాసులు చాలామంది ఇరుకు ఇళ్లలో ఉంటారు. ఇలాంటి వారు కరోనా బారినపడి లక్షణాలు తక్కువగా ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అద్దె భవనాల్లో ప్రత్యేక పడకలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోందని నిపుణులు సూచిస్తున్నారు.

  • బహదూర్‌పురా నియోజకవర్గంలోని అలియాబాద్‌లో ‘యు’ ఆకారంలో 8 రేకుల షెడ్లుంటాయి. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇటీవల ఇక్కడి ఓ ఇంట్లోని తల్లి, కుమారుడికి వైరస్‌ సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. వీరితో మరుగుదొడ్డిని పంచుకొనేందుకు భయపడి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
  • మేకలబండలో వ్యాధి లక్షణాల్లేని పలువురు ఇరుగుపొరుగు వారితో మాటామంతీ కలపడం వల్ల అనేకమంది మహమ్మారి బారిన పడ్డారు. ఇలా అలియాబాద్‌ చుట్టుపక్కల ఇప్పటివరకు 106 మంది వైరస్‌ బారినపడ్డారు.

ఖైరతాబాద్‌ జోన్‌లోనే పురోగతి

తమ ఆదేశాలకు ఒక్క ఖైరతాబాద్‌ జోన్‌ అధికారులు మాత్రమే కొద్దిమేర స్పందించినట్లు కేంద్ర కార్యాలయం అధికారులే చెబుతున్నారు. ఏసీ గార్డ్స్‌లోని ఓ కళాశాలను, లంగర్‌హౌజ్‌లోని ఓ పాఠశాలను, చాదర్‌ఘాట్‌ సమీపంలోని క్రీడా ప్రాంగణాన్ని, నిమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సహాయకులు సేదతీరే భవనాన్ని, షేక్‌పేట నాలా రోడ్డులోని పాఠశాలను ఐసోలేషన్‌ కేంద్రాల కోసం ఎంపిక చేశారు. ఏర్పాట్లు పురోగతిలో ఉన్నాయి. మిగతా జోన్ల నుంచి మాత్రం సమాచారం లేదని తెలిపింది.

ఇదీ గ్రేటర్‌లో కరోనా కేసుల పరిస్థితి

  • నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు: 43,348
  • యాక్టివ్‌ కేసులు: 11,345
  • హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు: 8346
  • ఇళ్లలో సరైన వసతులు లేనివారు: సుమారు 4 వేల మంది

ఇదీ చదవండిః జిల్లాలో కొత్తగా 25 కరోనా కేసులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.