ఏపీలో కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ.. నిత్యం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతోంది. పోలీసులు ఆ వేళల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈనెల 14తో ఈ కర్ఫ్యూ గడువు ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరవనుండడం.. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న తీరుతో కర్ఫ్యూ ఎత్తేసే అవకాశముందని సమాచారం.
ఇదీ చదవండి: KRMB, GRMB Meeting: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ... తెలంగాణ గైర్హాజరు