ETV Bharat / city

'రాష్ట్రంలో కరోనా వైరస్​ సమూహ వ్యాప్తి చెందలేదు'

author img

By

Published : Jun 11, 2020, 5:55 AM IST

ఎక్కడ చూసిన కరోనా మాటే... ఎవరి నోట విన్నా మహమ్మారి భయమే . రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య వెరసి ప్రజల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. సమూహ వ్యాప్తి ఎప్పుడో జరిగిఉంటుందని కొంతమంది జోస్యమూ చెప్పారు. అయితే ఐసీఎంఆర్‌ మాత్రం ప్రజల భయాందోళనలను పటాపంచలు చేసింది. తెలంగాణలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని తేల్చి చెప్పింది.

ఐసీఎంఆర్‌
ఐసీఎంఆర్‌

దేశంలో కరోనా వ్యాప్తి తీరు తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌ చేపట్టిన సర్వే ఫలితాలను బుధవారం వెల్లడించింది. సమూహ వ్యాప్తిపై అనేక అనుమానాలు నెలకొంటున్న వేళ... ఈ సర్వే ఫలితాలు ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చాయి. తొలుత దేశవాప్తంగా 69జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సీరం సర్వేని నిర్వహించింది. తెలంగాణలో మే 15నుంచి 17వరకు ఎన్​ఐఎన్​ ఆధ్వర్యంలో శాంపిళ్లు సేకరించారు.

విశ్లేషించిన తర్వాత...

నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 400 చొప్పున 1200 రక్తనమూనాలు తీసుకున్నారు. ఆ తర్వాత మే 30, 31 తేదీల్లో దేశంలోని 13 హాట్ స్పాట్ నగరాల్లో ఒకటైన భాగ్యనగరంలోనూ 500 శాంపిళ్లు సేకరించారు. హైదరాబాద్​ నగరంలో కేసులు అధికంగా ఉన్న చందానగర్, మియాపూర్, టప్పాచబుత్ర, ఆదిభట్ల , బాలాపూర్‌లలో ఒక్కో కంటైన్మెంట్ నుంచి 100 చొప్పున రక్తనమూనాలు సేకరించారు. వాటిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్‌ట్యుబెక్యులోసిస్ సంస్థలో విశ్లేషించిన తర్వాత.... తెలంగాణలో కమ్యునిటీ స్ప్రెడ్ లేదంటూ ఐసీఎంఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.

ఉపశమనం కలిగింది..

జిల్లాల్లో సేకరించిన 1200 సాంపిళ్లకు గాను కేవలం నలుగురికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో సేకరించిన 500శాంపిళ్లలో 15మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. గత కొంతకాలంగా పెరుగుతున్న కేసులతో సమూహ వ్యాప్తి జరిగిందేమోనని ప్రజల్లోనూ భయం పెరిగింది. అయితే తాజాగా ఐసీఎంఆర్​ నివేదికతో ప్రజలకూ కొంతమేర ఉపశమనం కలిగింది.

లాక్‌డౌన్‌ సక్రమంగా అమలు చేయడం వల్లే రాష్ట్రంలో సమూహ వ్యాప్తిని అరికట్టగలిగామని ఐసీఎంఆర్​ పేర్కొన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి: 'జర్నలిస్టులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.