ETV Bharat / city

Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్‌ దాటిన కరోనా టీకా పంపిణీ

రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ కోటి మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్‌లు కలిపి మొత్తం కోటీ టీకాలు పంపిణీ చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు హర్షం వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం... వ్యాక్సిన్‌ వేడుకలు జరుపుకుంది. వచ్చే రెండు మూడ్నెళ్లలో అర్హులైన వారందరికీ టీకాలు వేస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

corona-vaccination-reached-one-crore-in-telangana

author img

By

Published : Jun 26, 2021, 4:40 AM IST

కరోనా కట్టడికి ప్రధాన అస్త్రమైన వ్యాక్సిన్‌ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేపడుతోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు, సూపర్‌ స్ప్రెడర్లకు దశల వారీగా టీకా అందజేసిన సర్కార్‌..... నెల రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌ చేపట్టింది. కాగా... టీకా పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం మరో మైలురాయిని చేరుకుంది. శుక్రవారంతో కోటి డోస్‌లు మార్క్‌ని చేరుకున్నట్లు సర్కార్‌ వెల్లడించింది. నిన్న సాయంత్రానికి మొత్తం కోటి 53వేల 358 డోస్‌లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ ప్రారంభం కాగా..... మొదటి 2 నెలలు కేవలం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్‌లకు మాత్రమే వ్యాక్సిన్‌ అందించారు. ఆరంభంలో టికా వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోయినా.... మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్‌పై పెరిగిన అవగాహనతో జనం నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలో కోటి డోస్‌ల మార్క్‌ని దాటడం పట్ల వైద్యారోగ్యశాఖ వేడుకలు జరిపింది. హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్యసంచాలకుని కార్యాలయంలో సీఎస్​ సోమేష్‌కుమార్‌ కరోనా టీకాపై ప్రత్యేక గీతం ఆవిష్కరించారు.

ప్రత్యేక డ్రైవ్​...

రాష్ట్రంలో ప్రస్తుతం 30ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తుండగా... విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున అధ్యాపకులు, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతుంది. జీహెచ్​ఎంసీ పరిధిలో 100 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌ చేపడుతుండగా... మరో 30 మొబైల్ కేంద్రాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా టీకా పంపిణీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. నగరంలో 22లక్షల 30 వేల 655 టీకాలు పంపిణీ చేయగా.... 12.7 లక్షలతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో, 11.8 లక్షలతో మేడ్చల్ జిల్లా మూడోస్థానాల్లో నిలిచాయి. నారాయణపేట్‌ జిల్లాలో అతితక్కువగా 50వేల 818 టీకాల పంపిణీ చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

మరింత వేగవంతం...

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2.2 కోట్ల మంది టీకాకు అర్హులుగా గుర్తించగా... రాబోయే రెండు మూడ్నెళ్లలో వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.