ETV Bharat / city

గర్భిణులపై మూడో దశ కరోనా ప్రభావం చాలా తీవ్రం

author img

By

Published : Jun 25, 2021, 8:17 AM IST

కరోనా మూడో దశ వచ్చే పక్షంలో గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని హైదరాబాద్‌ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ రమేష్‌ కంచర్ల తెలిపారు. రెండో దశలో కొవిడ్‌ బారిన పడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెద్దల్లో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి వచ్చినట్లే చిన్నారులను మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌-సి) ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే వెంటిలేటర్‌ సహాయం తీసుకోవాల్సి వస్తోందని, తక్షణం గుర్తించి వైద్యం అందిస్తే కొద్ది రోజుల్లోనే కోలుకుంటున్నారని తెలిపారు. డాక్టర్‌ రమేష్‌ ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు.

corona cases in telangana, corona third wave, third wave corona effect on pregnant women
తెలంగాణలో కరోనా, గర్భిణులపై మూడో దశ కరోనా, గర్భిణులకు మూడో దశ ముప్పు

గర్భిణులపై కరోనా రెండో దశ ప్రభావం ఎలా ఉంది?

రెండో దశలో కరోనా వైరస్‌ సోకిన గర్భిణులు వెంటనే కోలుకోవడం కష్టమైంది. కొంతమందిపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించి వెంటిలేటర్‌ మీద కూడా పెట్టాల్సి వచ్చింది. గర్భిణులు సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది కేజీల బరువు పెరుగుతారు. అదే సమయంలో వారి పొట్ట ఊపిరితిత్తులను తన్నిపెట్టి ఉంటుంది. దీనివల్ల వీరి ఊపిరితిత్తులు సాధారణ వ్యక్తుల్లా పూర్తి స్థాయిలో పనిచేయవు. కరోనా సోకినవారిలో చాలా మందిని ఆక్సిజన్‌ కోసం బోర్లా పడుకోబెట్టి వైద్యం చేస్తుంటాం. గర్భిణులకు అలా చికిత్స చేయడానికి కూడా కుదరదు.

కరోనా వైరస్‌ సోకిన మహిళల్లో తక్కువ రోజుల్లోనే ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తోంది. ఇటువంటి కేసుల్లో హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ, ఎన్‌ఐవీ వ్యవస్థల ద్వారా అధికస్థాయిలో ఆక్సిజన్‌ అందించాల్సి ఉంది. ఈ వ్యవస్థల ద్వారా ఆక్సిజన్‌ ఇచ్చినపుడు కొందరు గర్బిణులు తట్టుకోలేకపోయారు. వారు కోలుకోవడం కష్టమైంది. కరోనాతో ఉన్న గర్భిణుల అప్పటి పరిస్థితిని బట్టి ఏడు, ఎనిమిది నెలల్లో ముందుగానే పురుడు పోశాం. ఇలాంటి వారు తొందరగా కోలుకున్నారు.

ఒకవేళ మూడో దశ కరోనా వస్తే మాత్రం గర్భిణుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రెండో దశలో వెంటిలేటర్‌ మీదకు వెళ్లిన గర్భిణులకు పూర్తి వైద్యం అందించినా కూడా అప్పటికే వారి ఊపిరితిత్తులు 70 శాతం పాడవడంతో చికిత్స పొందుతూనే మరణించారు. మూడో దశలో మరింత తీవ్ర లక్షణాలున్న కరోనా వైరస్‌ ప్రబలితే అప్పుడు గర్భిణులకు అందరికంటే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. వారి ఊపిరితిత్తుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణుల పరిశీలనలో తేలింది.

మరి కొవిడ్‌ బారిన పడిన చిన్నారుల్లో..

వైరస్‌ సోకిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోంది. 2-4 వారాల మధ్య మిస్‌-సీ వ్యాధి బారిన పడేలా చేస్తోంది. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లంతా దద్దుర్లు, వాపులు, రక్త సరఫరా తగ్గడం తదితరాలు లక్షణాలు ఉంటున్నాయి. గుండె, ఇతర అవయవాల పనితీరు సక్రమంగా ఉండదు. స్టిరాయిడ్స్‌ ఇవ్వడంతోపాటు ఇమ్యునోగ్లోబ్యులిన్‌ థెరపీ మొదలు పెట్టాలి. ఆలస్యంగా వైద్యం ప్రారంభిస్తే వెంటిలేటర్‌పై పెట్టాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇప్పటివరకు మరణాలు పెద్దగా లేకపోయినా పరిస్థితి విషమంగా మారిన సందర్భాలున్నాయి. రెండు వారాల కిందటి వరకు ఈ కేసులు చాలా వచ్చాయి. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఈ లక్షణాలున్న పిల్లలను తల్లిదండ్రులను వెంటనే గుర్తించి ఆసుపత్రుల్లో చేర్చించాలి.

మూడో దశ చిన్నారులపై అధిక ప్రభావం చూపిస్తుందన్న వార్తల్లో నిజమెంత?

ఇది నిజం కాదు. గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది చిన్నపిల్లల నిపుణులతో వెబినార్‌ ద్వారా మాట్లాడుతున్నాం. ఏ ఒక్కరూ ఈ విషయం చెప్పలేదు. రెండో దశలో అధిక సంఖ్యలో చిన్నారులు ప్రభావితులైన మాట వాస్తవమే. బాధిత తల్లిదండ్రులతో కలిసి ఉండడమే అందుకు కారణం. మూడో దశలోనూ పెద్దల మాదిరిగానే కొందరు పిల్లలు దీని బారినపడే అవకాశం ఉంది తప్ప లక్షల మంది ప్రభావితులవుతారు అన్నది వాస్తవం కాదు.

పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గత 15 నెలలుగా పిల్లలు జాగ్రత్తలు, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. సాధారణంగా ఈ సీజన్‌లో వేల మంది మంది చిన్నారులు సీజనల్‌ వ్యాధులకు గురై ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. గత మూడు నెలలుగా చిన్న పిల్లల ఆసుపత్రుల ఓపీలన్నీ ఖాళీగా ఉన్నాయి. దీన్నిబట్టి ఒకవేళ మూడో దశలో కొందరు చిన్నారులకు వైరస్‌ సోకినా వెంటనే కోలుకుంటారని చెప్పొచ్చు. పిల్లల పరిశుభ్రత, పోషకాహారంపై పెద్దలు దృష్టిసారించాలి.

ఇంకా సన్నద్ధత ఎలా ఉండాలి?

టీకాలు వేయడమే ఏకైక పరిష్కారం. వ్యాక్సిన్ల వల్ల ఎవరికీ.. ఎలాంటి ముప్పూ లేదు. ఇతర అనారోగ్య సమస్యలు(సైడ్‌ఎఫెక్ట్స్‌) ఏవీ తలెత్తవు. గర్భిణులు, పిల్లలకు టీకాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదు. గర్భిణులకు, బాలింతలకు, 12-15 మధ్య వయసున్న పిల్లలకు టీకాలు ఇచ్చే విషయంలో ముందడుగు వేస్తే నిశ్చింతగా ఉండొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.