ETV Bharat / city

ముందు నెగిటివ్.. తర్వాత పాజిటివ్! - corona virus update news

ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా టీ. నరసాపురం మండలం ఏపిగుంట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అతను దిల్లీ వెళ్లి వచ్చిన కుటుంబాన్ని కలిసిన కారణంగా.. వారినీ 14 రోజులు క్వారంటైన్​లో ఉంచారు. అనంతరం సదరు వ్యక్తికి పరీక్షల్లో నెగిటివ్​ అని తేలిన కారణంగా.. ఇంటికి పంపారు. అంతలోనే... మళ్లీ పాజిటివ్ వచ్చిందంటూ ఆసుపత్రికి తరలించారు.

corona-positive-case-at-eepigunta-west-godavari-district
ముందు నెగిటివ్.. తర్వాత పాజిటివ్!
author img

By

Published : Apr 26, 2020, 9:21 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం ఏపిగుంట గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అతడిని ఏలూరు క్వారంటైన్​కు తరలించారు. అతని కుటుంబ సభ్యులతోపాటు మొత్తం 19 మందిని తాడేపల్లిగూడెం ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి దిల్లీ నుంచి వచ్చిన ముస్లిం కుటుంబాన్ని కలిసిన కారణంగా.. 14 రోజులు తాడేపల్లిగూడెం క్వారంటైన్​లో ఉంచారు.

శనివారం ఉదయం అతనికి ఎలాంటి లక్షణాలు లేవని గ్రామానికి పంపించారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో కరోనా పాజిటివ్​గా తేలినట్టు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాలంటూ జిల్లా వైద్యాధికారులు ఫోన్ చేయగా మండలంలోని రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అతన్ని ఏలూరుకు తరలించారు.

ఇవీ చూడండి: కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.