ETV Bharat / city

ఏపీలో కొత్తగా 20,065 కరోనా కేసులు.. 96 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 20,065 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో 96 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 1,01,571 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

corona new cases, andhra pradesh corona cases
ఏపీలో కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు
author img

By

Published : May 8, 2021, 6:19 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శుక్రవారం కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే, గత 24 గంటల్లో మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 1,10,571 శాంపిల్స్‌ పరీక్షించగా, 20,065మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

చిత్తూరులో అత్యధికంగా 2,269 కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత తూర్పుగోదావరి 2,370, విశాఖ 2525లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7,065 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే 6,300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయానని వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.