ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, కంచరపాడు గ్రామంలో వెనుకబడి ఉన్న గిరిజనులకు ఆకులే మాస్కులయ్యాయి. అడవిలో దొరికే ఆకులతో మాస్కులను తయారు చేసుకుని, ఇంటి వద్దనే ఉంటూ తమ పనులను చేసుకుంటున్నారు. వేసవికాలంలో పండే చింత బొట్లను ఏరుకొని.. ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు గిరిజనులు.
లాక్డౌన్ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి తప్పించుకునేందుకు ఆకులనే మాస్కులుగా వాడుతున్నారు. ఆకుల్లో ఉండే ఔషధాలు వైరస్ బారిన పడకుండా ఉపయోగపడతాయని వారు అంటున్నారు. ఇక్కడ లభించే మూలికలలో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ శక్తి ఉంటుందని వారి నమ్మకం.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు తమ దాకా చేరట్లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా మరో 44 కేసులు నమోదు.