భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్‌లోని పీజేఆర్ నగర్లో తాజాగా 8 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో జీహెచ్ఎంసీ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గీతా రాధిక పర్యటించారు.
ఆ బస్తీలోని ఇళ్లకు వెళ్లి నర్సులతో పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా గురించి అవగాహన కల్పించామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి : ఆ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సార్థకమైంది: కేటీఆర్