ETV Bharat / city

ఏపీలో కొత్తగా 12,634 కరోనా కేసులు, 69 మరణాలు - today corona cases in ap

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 62,885 పరీక్షలు నిర్వహించగా.. 12,634 కేసులు నిర్ధరణ అయ్యాయి. 69 మంది మృతి చెందారు.

to day corona casess in ap, ap corona news update today
ఏపీలో కొత్తగా 12,634 కరోనా కేసులు, 69 మరణాలు
author img

By

Published : Apr 25, 2021, 6:47 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్​ బారిన పడుతున్న బాధితుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 62,885 పరీక్షలు నిర్వహించగా.. 12,634 కేసులు నిర్ధరణ అయ్యాయి. 69 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్​లో 10,33,560 మంది వైరస్‌ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు; తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; అనంతపురం, కడప ఐదుగురు చొప్పున; చిత్తూరు, గుంటూరులో నలుగురేసి; ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున; కర్నూలులో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు 7,685 మంది మృతి చెందారు.

24 గంటల వ్యవధిలో 4,304 మంది బాధితులు డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,36,143కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,680 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 331 మంది వైరస్‌ బారినపడ్డారు.

  • #COVIDUpdates: 25/04/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,30,665 పాజిటివ్ కేసు లకు గాను
    *9,33,248 మంది డిశ్చార్జ్ కాగా
    *7,685 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,732#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QS4PobTKhl

    — ArogyaAndhra (@ArogyaAndhra) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : కరోనా కాటుకు సర్పంచ్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.