ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 7,948 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మొత్తం బాధితుల సంఖ్య 1,10,297కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 58 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు 1,148 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 56,527కు చేరింది. కొవిడ్ నుంచి 52,622 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62,979 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకు 17.49 లక్షల నమూనాలను పరీక్షించారు.