ETV Bharat / city

ఏపీలో తొలిసారి తిరుపతిలో పోస్ట్​ కొవిడ్​ ఓపీ ప్రారంభం

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి ఆరోగ్యంపై ఏపీలోని తిరుపతి రూయా వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. తొలిసారిగా పోస్ట్‌ కొవిడ్‌ ఓపీని ప్రారంభించారు. ఓపీ బ్లాక్‌లో ప్రత్యేకంగా ఓ గది కేటాయించి.. కరోనా అనంతరం అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు.

corona-cases-in-chittoor-district
రాష్ట్రంలో తొలిసారి తిరుపతిలో పోస్ట్​ కొవిడ్​ ఓపీ ప్రారంభం
author img

By

Published : Nov 3, 2020, 7:16 PM IST

ఏపీలో తొలిసారి తిరుపతిలో పోస్ట్​ కొవిడ్​ ఓపీ ప్రారంభం

కరోనా తీవ్రత తగ్గింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి రుయా ఆసుపత్రిలో పోస్ట్‌ కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా.. 80 వేల మంది కరోనా బారిన పడ్డారు. 790 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు కరోనా నుంచి కోలుకున్నారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారితో పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నవారు కరోనా అనంతరం ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణ రోగులతో కలిపి అలాంటి వారికి చికిత్స అందించండం ద్వారా ఇబ్బందులు వస్తాయని భావించి ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేశారు. పోస్ట్‌ కొవిడ్‌ ఓపీ కేంద్రంలో కరోనా అనంతరం రోగి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చికిత్సతో పాటు మానసిక ధైర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో.. 20 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. సాధారణ ఓపీలో రోగులతో కలిసి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడం.. ఇతర ఇబ్బందుల దృష్ట్యా వారి కోసం ప్రత్యేకంగా ఓపీ ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌ కొవిడ్‌ ఓపీకి వచ్చే వారి ఆరోగ్య సమస్యలను క్రోడీకరించి.. పరిశోధనలకు ప్రామాణికంగా తీసుకోవడానికి రుయా వైద్యులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: చివరి గంటలో ఓటు వేస్తున్న కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.