ETV Bharat / city

AP corona cases: ఏపీలో కొత్తగా 675 కరోనా కేసులు, 3 మరణాలు - ఏపీలో కరోనా కేసులు

AP CORONA CASES: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 675 కేసులు నమోదు కాగా.. ముగ్గురు మరణించారు. కొవిడ్​ నుంచి కొత్తగా 2,414 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది.

AP corona cases
ఏపీ కరోనా కేసులు
author img

By

Published : Feb 16, 2022, 8:19 PM IST

AP CORONA CASES: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 675 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి కొత్తగా 2,414 మంది పూర్తిగా కోలుకోగా.. వైరస్​ బారిన పడి రాష్ట్రంలో మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 10,808 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 24,663 మందికి కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

AP corona cases
ఏపీలో కొత్తగా 675 కరోనా కేసులు, 3 మరణాలు
  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
    India Covid cases: భారత్​లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 30,615 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. కొవిడ్​ ధాటికి మరో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,988 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
  • మొత్తం కేసులు: 4,27,23,558
  • మొత్తం మరణాలు: 5,09,872
  • యాక్టివ్ కేసులు: 3,70,240
  • మొత్తం కోలుకున్నవారు: 4,18,43,446

Covid Tests in India: దేశవ్యాప్తంగా మంగళవారం 12,51,677 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,42,84,979కు చేరింది.

Vaccination in India: దేశంలో సోమవారం 41,54,476 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,73,86,81,675 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World corona cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 19,00,985 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 41,57,78,024గా ఉండగా.. మరణాల సంఖ్య 58,55,707కు చేరింది.

  • అమెరికాలో 94 వేల కొత్త కేసులు.. 2,202 మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీలో ఒక్కరోజే 1.77 లక్షల మందికి పైగా కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 214 మంది మృతిచెందారు.
  • రష్యాలో మరో 1.66 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 704 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 1.42 వేల మందికి పైగా కరోనా సోకింది. 390 మంది మరణించారు.
  • టర్కీలో తాజాగా 94 వేల కేసులు బయటపడగా.. 309 మంది బలయ్యారు.

ఇదీ చదవండి: 19% తగ్గిన కరోనా కేసులు.. ఆ ఒక్కచోట మాత్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.