ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్త కేసులతో... రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 1,177కు చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదుకాలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. వివిధ ఆసుత్రుల్లో 911 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.
జిల్లాల వారీగా కేసులు
కృష్ణా జిల్లాలో కొత్తగా 33 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 210కి చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 23 కేసులు వచ్చాయి. వీటితో కేసులు 237కు చేరాయి.
కొత్తగా కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 1 కేసు నమోదయింది. గడిచిన 24 గంటల్లో 6,517 నమూనాలు పరీక్షించామని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 292కు చేరాయి. నెల్లూరు జిల్లాలో 79, పశ్చిమ గోదావరి జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 4కు చేరాయి.