గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 62,856 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 1,439 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ నుంచి మరో 1,311 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 14,624 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా మరణాలు..
వైరస్ కారణంగా కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
అనంతపురంలో 23, చిత్తూరులో 261, తూర్పుగోదావరిలో 170, గుంటూరులో 142, కడపలో 66, కృష్ణాలో 131, కర్నూలులో 8, నెల్లూరులో 260, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 79, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 182 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: Booster Vaccine: 'అప్పటివరకు బూస్టర్ డోసులు ఆపండి'