ETV Bharat / city

CP Mahesh Bhagawath : లాక్​డౌన్​తో కరోనా తగ్గుముఖం - rachakonda cp mahesh bhagawath

రాచకొండ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన లాక్​డౌన్​తో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

telangana news, lock down in telangana, telangana lock down
తెలంగాణ వార్తలు, తెలంగాణలో లాక్​డౌన్, తెలంగాణలో లాక్​డౌన్ 2021
author img

By

Published : May 28, 2021, 2:55 PM IST

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయని, ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అన్నారు. లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని వరంగల్‌ జాతీయ రహదారి, పోలీసు చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.

లాక్​డౌన్‌ నిబంధనలను పాటించనివారిపై రోజుకు 4వేల కేసులు నమోదు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. రోజుకు వెయ్యి నుంచి 1500 వరకు వాహనాలు సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించి ఇంట్లోనే ఉండాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.