తెలంగాణపై కరోనా రెండో దశ వ్యాప్తి ఉంటుందన్న నిపుణుల అంచనా మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం తాజాగా 921 కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు.
ఇప్పటి వరకు మొత్తం 2,65,049 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 1437 మంది మృతి చెందారు. మరో 1097 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు కొవిడ్ నుంచి 2,52,565 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,047 యాక్టివ్ కేసులుండగా.. 8,720 మంది ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 146, మేడ్చల్ జిల్లాలో 81, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు నమోదయ్యాయి.