ETV Bharat / city

చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎనర్జీ డ్రింక్స్ అందజేత

author img

By

Published : Jun 10, 2021, 7:00 AM IST

లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చేయడంలో పోలీసుల పాత్ర కీలకమైందని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతూ సూపర్ వారియర్స్​గా శ్రమిస్తున్న పోలీసు శాఖ సేవ మరువలేనిదన్నారు. హైదరాాబాద్​లో పలు చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆమె ఎనర్జీ డ్రింక్స్​ను అందజేశారు.

Energy drinks distribution to police in Hyderabad

కరోనా సమయంలో పోలీసులు అందించిన సేవలు అనిర్వచనీయమని హైదరాబాద్ గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పేర్కొన్నారు. చిక్కడపల్లి డివిజన్​లోని చెక్ పాయింట్ల వద్ద లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు తమ వంతు సాయం అందించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చెక్ పోస్ట్ వద్ద చిక్కడపల్లి డివిజన్ ఎసీపీ శ్రీధర్, అడిషనల్ సిఐ. ప్రభాకర్, ముషీరాబాద్ చెక్ పోస్ట్ వద్ద ఇన్​స్పెక్టర్ మురళి కృష్ణ, ఇందిరా పార్క్ చెక్ పోస్ట్ వద్ద ఇన్​స్పెక్టర్ శివ శంకర్, ఎస్ఐలు, కవాడీ గుడా, వైస్రాయ్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పోలీసు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్​ని అందచేశారు.

ప్రపంచామంతా భయానకమైన కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో.. ఆ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్నివేళలా ముందు ఉండి పోలీసులు సేవలందిస్తున్నారన్నారు. కరోనాతో పోరాడుతూ, ప్రజల శ్రేయస్సే తమ కర్తవ్యంగా, కరోనా సూపర్ వారియర్స్​గా శ్రమిస్తున్న పోలీసు శాఖను ఎవ్వరూ మరువలేరన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నగర సీనియర్ నాయకులు ఎ. వినయ్ కుమార్, ఆనంద్ రావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చుడండి: ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.