జూనియర్ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల బదిలీలపై అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. సీఎం స్పందించి తక్షణమే బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆర్జేడీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదెవెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలపైనా 70 రోజులైనా ఇప్పటిదాకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఆరోపించారు.
![contract lecturers dharna for the transfers of over the state in junior colleges](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_hyd_46_25_lecturers_andolana_ab_ts10005_7_2501digital_1611568969_421.jpg)
అధికారుల తీరును వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ముగించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సానుకూలంగా ఉన్నా మార్గదర్శకాలు విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గాదె వెంకన్న హెచ్చరించారు.