ETV Bharat / city

శెభాష్ అర్షద్: సొమ్మసిల్లిన మహిళను కాపాడిన కానిస్టేబుల్

ఏపీలోని తిరుమలలో పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరిని కానిస్టేబుల్‌ అర్షద్​ కాపాడారు. దాదాపు 6 కిలోమీటర్ల దూరం భుజాలమీద మోసుకెళ్లి శెభాష్​ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి.

conistable-saves-two-persons-at-thirumala
సొమ్మసిల్లిన మహిళను కాపాడిన కానిస్టేబుల్
author img

By

Published : Dec 24, 2020, 5:33 PM IST

ఏపీలో తిరుమల మహా పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరిని.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ షేక్ అర్షద్... దాదాపు 6 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవి మార్గంలో భుజాలపై మోసుకుని వెళ్లారు. కాలి నడకన తిరుమలకు బయలుదేరిన నాగేశ్వరమ్మ... 'గుర్రపు పాదం' వద్ద హైబీపీతో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది.

సొమ్మసిల్లిన మహిళను కాపాడిన కానిస్టేబుల్

ఆమెను గమనించిన కానిస్టేబుల్ అర్షద్.. పెద్ద సాహసమే చేశారు. 6 కిలోమీటర్లపాటు భుజాలపై మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అంతకుముందు నాగేశ్వరరావు అనే వృద్ధుడిని సైతం ఇలాగే భుజాలపైనే మోసుకెళ్లారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి : ప్రజల మన్ననలందుకుంటోన్న జమ్మికుంట ఠాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.